హైదరాబాద్: ఫిపా వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా మంగళవారం సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పుట్‌బాల్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాప్రాంగణం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. మొత్తం ఐదు జట్లు ఉన్న గ్రూప్ ఈలో భారత పుట్‌బాల్ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. క్వాలిఫయిర్స్ టోర్నీలో భాగంగా భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో ఓడిపోగా… మరొక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. గౌహతి వేదికగా ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-2తేడాతో ఓడిపోయింది. 700వ గోల్ చేసిన రొనాల్డోకు ఒక పక్క సంతోషం, మరోవైపు బాధ! ఆ తర్వాత ఖతార్‌తో జరిగిన రెండో మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. ఖతర్‌తో మ్యాచ్‌కు దూరమైన సునీల్ ఛెత్రి తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం భారత్ 104వ ర్యాంకులో ఉండగా… బంగ్లాదేశ్ 207 ర్యాంకులో ఉంది. ఛెత్రి, బల్వంత్ సింగ్, మన్వీర్ సింగ్‌లతో కూడిన అటాకింగ్ చెలరేగితే భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించినట్లే. ఇక, మిడ్‌ఫీల్డ్‌లో ఉదాంత సింగ్, ఆశికి కురునియన్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఛెత్రి మాట్లాడుతూ “ఇది ఛెత్రికి, బంగ్లాదేశ్‌కు మధ్య జరిగే మ్యాచ్ కాదు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య జరిగేది. నేను జట్టులో ఒక సభ్యుడిని మాత్ర మే. జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు” అని మీడియా సమావేశంలో ఉన్నాడు. India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? October 15, సాల్ట్ లేక్ స్టేడియం కోల్‌కతా India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్ ఎన్నిగంటలకు ప్రారంభం? భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 07:30 గంటలకు India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్‌ని ఏ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తోంది?స్టార్…